Rapur: పోలీసుల అమరవీరులకు ఘన నివాళి.. రాపూరులో ర్యాలీ

Rapur: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరులో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Yellayya, Nellore
Published on: 25 Oct 2026 10:57 PM IST
Rapur
X

Rapur: పోలీసుల అమరవీరులకు ఘన నివాళి.. రాపూరులో ర్యాలీ

Rapur: పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా రాపూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాపూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాపూరు పోలీస్ స్టేషన్‌ నుంచి బస్టాండ్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసు సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసు అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఎస్సై తిరుమలరావు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore