Buchireddypalem: బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీలోకి టీడీపీ మహిళా నాయకుల చేరికలు
Buchireddypalem: బుచ్చిరెడ్డిపాలెం 11వ వార్డుకు చెందిన టీడీపీ మహిళా నేత షేక్ నూర్జహాన్ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
Buchireddypalem: బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీలోకి టీడీపీ మహిళా నాయకుల చేరికలు
బుచ్చిరెడ్డిపాలెం: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని 11వ వార్డు ఖాజా నగర్కు చెందిన షేక్ నూర్జహాన్ గారు తెలుగుదేశం పార్టీని వీడి, మాజీ మంత్రి, వైసీపీ కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆమెను వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆమెతో పాటు షేక్ జారిన, షేక్ ఆసియా, షేక్ హబీబ్, షేక్ పర్వీన్, షేక్ నౌషాద్, షేక్ షాహీన, షేక్ మస్తానమ్మ, షేక్ రేష్మ తదితరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షేక్ షకీలా బేగం, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్, డాక్టర్ అల్లాబక్షు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




