Buchireddypalem: టీడీపీలో చేరిన 40 కుటుంబాలు – ఎమ్మెల్యే చేరికలు!

Buchireddypalem: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ వీడి టీడీపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 26 Oct 2026 11:28 PM IST
Buchireddypalem
X

Buchireddypalem: టీడీపీలో చేరిన 40 కుటుంబాలు – ఎమ్మెల్యే చేరికలు!

బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 21 వార్డులకు చెందిన 40 మంది వైసీపీ నాయకులు, వారి కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం నాయకులు రాచూరి సత్యం, మారుతుం ప్రతాప్ రెడ్డి, వింజం రమేష్, ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో కే.వెంకట్ రెడ్డి, కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వరద సురేష్, గాధమ్ శెట్టి నాగేంద్ర, కైపు వెంకు రెడ్డి, మామిళ్ల మధు, కృష్ణ, పెంచల్ రెడ్డి, ఏడుకొండలు, కేశవులు, పుట్ట వెంకటేశ్వర్లు, రాఘవులు, విష్ణు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించుకొని రెట్టింపు ఉత్సాహంతో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేద్దామన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore