Nellore: నెల్లూరులో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నాయకుల నిరసన!
Nellore: నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నిరసన. మహిళా పోలీసుల పట్ల అనుచిత ప్రవర్తనను ఖండించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నేతలు.
Nellore: నెల్లూరులో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నాయకుల నిరసన!
Nellore: నెల్లూరులోని గాంధీ బొమ్మ దగ్గర బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా మోర్చా ఇంచార్జి సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మహిళా పోలీసుల మీద చేసిన అనుచిత ప్రవర్తన కు నిరసన వ్యక్తపరిచి తీవ్రంగా ఖండించారు. తదుపరి మీడియా సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మహిళా పోలీసుల శరీరాలపై ఉద్దేశపూర్వకంగా చేతులు వేసి అసభ్యంగా చేసిన చర్యలు దేశమంతా చూసి నిర్గాంత పోయింది అని ప్రత్యేకించి దేశంలో ఉన్న మహిళలంతా ముక్తకంఠంతో ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారని రాహుల్ గాంధీ పోలీస్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిచ్చిందని అలాగే ఏనాడు మహిళల హక్కులకు సమాన గౌరవం అవకాశాలు కల్పించలేదని వారి హయాంలో మహిళలకి గౌరవం పొందిన దాఖలు లేవు అని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మహిళా పోలీసులు మీద చేసిన అనుచిత ప్రవర్తన మరియు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి మహిళలను అగౌరపరుస్తున్నారని అలాగే ఓట్ చోరి అని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ చనిపోయిన వారి ఓట్లు తొలగించడం సమంజసం కాదు అనడం సరికాదని అన్నారు.
పై కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు రాజేశ్వరమ్మ, ఏ.ఎం.సి డైరెక్టర్ ప్రసన్నమ్మ, ప్రధాన కార్యదర్శులు కవిత, హరిత, శివ పార్వతి, సుజన మరియు మహిళా మోర్చా నారీమణులు పాల్గొన్నారు.




