Kondapuram: కొండాపురంలో CHC ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్!

Kondapuram: కొండాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) మంజూరు చేయాలని బీజేపీ నాయకుల వినతి. జనతా వారధిలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన మండల అధ్యక్షుడు మహేష్.

V. Kamaiah, Vinjamuru
Published on: 21 Sept 2026 2:48 PM IST
Kondapuram
X

Kondapuram: కొండాపురంలో CHC ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్!

Kondapuram: కొండాపురం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే కొండాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (CHC) ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు.జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ కొండాపురం మండల అధ్యక్షులు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆదినారాయణకు వినతిపత్రం సమర్పించారు.

కొండాపురం మండలంలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలకు అవసరమైన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని నాయకులు తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాత ఆసుపత్రి స్థానంలో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మించి,దానిని CHCగా అభివృద్ధి చేయాలని కోరారు.

మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావం కారణంగా ఎముకలు,కీళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన సందర్భాల్లో స్థానికంగా తగిన వైద్య సదుపాయాలు లేక ఏరియా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కొండాపురం మండలం ఏరియా ఆసుపత్రికి దూరంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందుకోవడం ప్రజలకు సమస్యగా మారుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొండాపురంలో CHC ఆసుపత్రి ఏర్పాటు చేసి,వైద్యులు, సిబ్బంది,అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అదేవిధంగా కొండాపురం–కలిగిరి ప్రధాన రహదారి సమస్యను కూడా పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. రహదారి సౌకర్యం మెరుగుపడితే మండల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు అత్యవసర వైద్య సేవలను వేగంగా పొందేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru