Atmakur: ఘనంగా సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ
Atmakur: ఆత్మకూరులో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
Atmakur: ఘనంగా సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ
ఆత్మకూరు: భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సీహెచ్.భరత్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు కుడుముల సుధాకర్‌రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు 13 విభాగాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దేశ ఆర్థిక పరిస్థితి, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అదే కోణంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నున్న సంతోష్‌కుమార్, టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు పొలిమి శైలజారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సర్దార్, మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్‌రెడ్డి, ఖాదర్‌బాషా, మధు, సందీప్, సుబ్బానాయుడు, ప్రవీణ్, సుధాకర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




