Atmakur: ఆత్మకూరు జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో మంత్రి ఆనం ప్రత్యేక పూజలు
Atmakur: ఆత్మకూరు శ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో రూ.5 లక్షలతో నిర్మించిన మెటల్ షీట్ మండపాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు.
Atmakur: ఆత్మకూరు జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో మంత్రి ఆనం ప్రత్యేక పూజలు
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పట్టణంలోని శ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన మెటల్ షీట్ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
ఆలయ సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధి నిమిత్తం దాతల సహకారంతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ షీట్ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.




