Atmakur: భవిత, ఎంఆర్‌సీ భవనాలను ప్రారంభించిన మంత్రి ఆనం
Atmakur: ఆత్మకూరులో భవిత, ఎంఆర్‌సీ భవనాలను ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి.
Atmakur: భవిత, ఎంఆర్‌సీ భవనాలను ప్రారంభించిన మంత్రి ఆనం
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో రూ.28.30 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనాన్ని చిన్నారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రూ.53 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ), మండల విద్యాశాఖాధికారి కార్యాలయ భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
విద్యా రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య, విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




