Atmakur: ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా కొలగాని శిరీష ఎన్నిక
Atmakur: నెల్లూరు ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెర; 17 మంది కూటమి కౌన్సిలర్ల మద్దతుతో జనసేన నేత కొలగాని శిరీష ఎన్నిక.
Atmakur: ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా కొలగాని శిరీష ఎన్నిక
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలో కొలగాని శిరీష పంతం నెగ్గించుకుంది. వైస్ చైర్మన్ గా జనసేన కౌన్సిలర్ కొలగాని శిరీష ఎన్నికయ్యారు.వైస్ చైర్మన్ ఎంపికపై రెండు రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధిష్టానం కేటాయించిన జనసేన అభ్యర్థి కొలగాని శిరీష ఎన్నికపై నిన్న తీవ్ర గందరగోళం నెలకొంది.
జనసేన అధిష్టానం నిర్ణయించిన కౌన్సిలర్ శిరీష కాకుండా కత్తి పద్మజాను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీంతో నిన్న కౌన్సిలర్ శిరీష భర్త, జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ సహా పలువురు ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్ట్ చేశారు.
సమస్య రాష్ట్ర స్థాయికి వెళ్లడంతో రంగంలోకి దిగిన జనసేన అధిష్టానం శిరీషకే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని తేల్చి చెప్పింది.ఇవాళ జరిగిన ఎన్నికలో 17 మంది కూటమి కౌన్సిలర్ల మద్దతుతో వైస్ చైర్ పర్సన్ గా శిరీష ఎంపికయ్యారు. దీంతో జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.




