Atmakur: ఆత్మకూరు అభివృద్ధికి సీఎం చంద్రబాబు అభయం

Atmakur: ఆత్మకూరు అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ. సోమశిల జలాశయం, హైలెవల్ కెనాల్ పనులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తికి సానుకూల స్పందన.

A Praveen, Nellore
Published on: 29 Sept 2026 7:14 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు అభివృద్ధికి సీఎం చంద్రబాబు అభయం

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి కీలక భరోసా లభించింది.

రామాపురంలో జరిగిన పల్లె పండుగ బహిరంగ సభలో సోమశిలకు సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది.

సోమశిల జలాశయం తో పాటు హైలెవల్ కెనాల్ మొదటి దశకు సంబంధించిన కీలక పనులను ముందుకు తీసుకెళ్లాలన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పానికి ముఖ్యమంత్రి స్పందన తో దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న సోమశిల అభివృద్ధి అంశానికి రామాపురం సభ వేదికగా మరో కీలక ముందడుగు గా భావిస్తున్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore