Atmakur: ఆత్మకూరులో డాక్టర్ షకీలా తరఫున కూటమి ప్రచారం

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, 28 వార్డుల కూటమి అభ్యర్థుల తరఫున నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 20 Oct 2026 9:30 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో డాక్టర్ షకీలా తరఫున కూటమి ప్రచారం

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎన్డీఏ కూటమి చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతుగా కూటమి పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు వార్డు అభ్యర్థులకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను నేరుగా కలుసుకుంటున్నారు.

వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, మున్సిపాలిటీ అభివృద్ధికి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మహిళలు, యువత,వ్యాపారులతో పాటు పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ షకీలా, 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో ఆత్మకూరులో రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థులు ఓటర్లను కలుసుకుంటూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రచారం మరింత విస్తరించే అవకాశం ఉండటంతో పట్టణంలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)