Rajavolu: రాజవోలు మహబూబ్ సుభాని దర్గా గంధ మహోత్సవం రేపే

Rajavolu: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు మహబూబ్ సుభాని దర్గా గంధ మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరగనుంది. భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 3 Oct 2026 5:48 PM IST
Rajavolu
X

Rajavolu: రాజవోలు మహబూబ్ సుభాని దర్గా గంధ మహోత్సవం రేపే

Rajavolu: ముస్లింల పవిత్ర మాసం గార్మిషరీఫ్ సందర్భంగా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో మహబూబ్ సుభాని దర్గా వద్ద నాలుగో తేదీ ఆదివారం రాత్రి ఘనంగా గంధ మహోత్సవం నిర్వహించనున్నారు.

గార్మి షరీఫ్ మహబూబ్ సుభాని దర్గా గంధమహోత్సవం సందర్భంగా ఆదివారం నాడు ఇక్కడ నిర్వహించే కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుండి కూడా భక్తులు భారీగా విచ్చేస్తారు.

ఈ గంధ మహోత్సవం సందర్భంగా ఇక్కడ అందించే కోరికల ఫలం (నియాజ్ ఫల్) అందుకోవడానికి జిల్లావ్యాప్తంగా భక్తులు భారీగా ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ ప్రసాదం అందుకున్న వారికి తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కావలసిన ఏర్పాట్లను దర్గా నిర్వాహకులు ఇప్పటికే సిద్ధం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)