Nellore: ప్రధాని మోదీ జన్మదినం: పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ!
Nellore: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు బస్ స్టేషన్‌లో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు చీరలు, అప్రాన్స్ పంపిణీ.
Nellore: ప్రధాని మోదీ జన్మదినం: పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ!
Nellore: దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు మెయిన్ బస్ స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బస్టాండ్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న అటెండర్లకు తెల్లరంగు అప్రాన్స్ (వెయిస్ట్‌కోట్స్) పంపిణీ చేశారు.
అదేవిధంగా నెల్లూరు ఆర్టీసీ గ్యారేజీలో ఉత్తమ సేవలు అందించిన 10 మంది మెకానికల్ సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రజా సేవలో భాగంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అటెండర్లు, మెకానికల్ సిబ్బంది సేవలను గుర్తించి వారిని గౌరవించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షమీమ్, జిల్లా ప్రజా రవాణాధికారి, నెల్లూరు, దివ్యకామాక్షి, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, నెల్లూరు, కె. గోవర్ధన్ రెడ్డి, డిపో మేనేజర్, నెల్లూరు-1, సూపర్వైజర్లు, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆఫీస్ సిబ్బంది, కార్మికులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు సేవా కార్యక్రమాలు నిర్వహించి, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని సత్కరించడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.




