Nellore: ఏపీలో జలమార్గాలు, వాటర్ మెట్రోకు సహకరించండి: శివ ప్రసాద్
Nellore: ఆంధ్రప్రదేశ్‌లో జలమార్గాలు, కార్గో, వాటర్ మెట్రో ప్రాజెక్టుల అభివృద్ధికి సహకరించాలని IWAI జాతీయ ఛైర్మన్‌ను APIWA ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్ కోరారు.
Nellore: ఏపీలో జలమార్గాలు, వాటర్ మెట్రోకు సహకరించండి: శివ ప్రసాద్
Nellore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర రోడ్లు, భవనములు, పెట్టుబడుల శాఖామాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి సూచనల మేరకు ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్ నేతృత్వంలోని APIWA బృందం నోయిడా లోని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో IWA నేషనల్ ఛైర్మెన్ సాహిల్ కుమార్ ఐఏఎస్ ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి అవకాశం ఉన్న పలు కార్గో - టూరిజం కీలక ప్రాజెక్ట్ లను వారి దృష్టికి తీసుకువచ్చారు.
కృష్ణా నదిపై ముక్త్యాల నుండి మచిలీపట్నం వరకు 168 కిలోమీటర్ల మేర రవాణా అవసరాలు, కార్గో - టూరిజం కోసం ఫెయిర్ వే నిర్మాణం చేపట్టవల్సిందిగా కోరడం జరిగింది.
జులై, 2027 లో జరగనున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి నదిపై సర్ ఆర్థన్ కాటన్ బ్యారేజ్ నుండి పోలవరం వరకు 40 కి.మీ. మేర టూరిజం అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.
అమరావతి కేంద్రంగా కృష్ణా నదిపై వాటర్ మెట్రో ఏర్పాటుకు అనుకూలమైన అంశాల పట్ల అధ్యయనం చేయవలసిందిగా కోరడం జరిగింది.
సంబంధిత ప్రాజెక్ట్ లను IWA నేషనల్ ఛైర్మెన్ సాహిల్ కుమార్ ఐఏఎస్ మరియు డైరెక్టర్ టెక్నికల్ శ్రీరాజ్ షిండే లకు వివరించగా వారు సానుకూలంగా స్పందించారు, ఈ సందర్బంగా వారికి APIWA ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.




