Nellore: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం.. అబ్దుల్ అజీజ్!
Nellore: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Nellore: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం.. అబ్దుల్ అజీజ్!
Nellore: స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, విద్యారంగ అభివృద్ధికి చేసిన విశేష కృషిని పలువురు నాయకులు స్మరించుకున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన అందించిన సేవలు, జాతీయ సమైక్యత కోసం చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులర్పించారు.




