Nellore: నెల్లూరులో అబ్దుల్ అజీజ్ పర్యటన.. కూటమి గెలుపే లక్ష్యం!
Nellore: అనంతపురంలో దసరా పండుగ నేపథ్యంలో వ్యాపారులతో సీఐ కౌలుట్లయ్య సమావేశం; బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
Nellore: నెల్లూరులో అబ్దుల్ అజీజ్ పర్యటన.. కూటమి గెలుపే లక్ష్యం!
Nellore: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూతన 72వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి నాయకత్వం నిర్ణయించే అభ్యర్థికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఏ వార్డు ఏ పార్టీకి కేటాయించాలన్నది కూటమి నాయకత్వం నిర్ణయిస్తుందని, టికెట్ ఏ పార్టీకి వచ్చినా కూటమి అభ్యర్థిగా భావించి కలిసి పనిచేయాలని అన్నారు.
72వ వార్డు విషయంలో జహీర్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా స్థానికంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ వార్డు టీడీపీకి కేటాయించిన పక్షంలో ఆయన పేరు అభ్యర్థిత్వ పరిశీలనలో ఉంటుందని, తుది నిర్ణయం మాత్రం కూటమి నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన నేపథ్యంలో కొత్త వార్డుల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నాయకత్వంలో నెల్లూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పార్కులు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కూడా ముఖ్యమన్నారు.
ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలను మెరుగైన ప్రమాణాలతో తీర్చిదిద్దే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మౌలిక వసతులతో పాటు పిల్లలకు నాణ్యమైన విద్య అందినప్పుడే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనుద్దీన్, ఇంతియాజ్, బాలాజీ, షాహీద్, పాషా, ఇక్బాల్, ఖుద్దుస్ బాబు, తదితరులు పాల్గొన్నారు.




