Nellore: డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సతీమణి డాక్టర్ లావణ్య మృతి చెందడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
Nellore: డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు నగరానికి చెందిన ఎన్ఎల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సతీమణి డాక్టర్ లావణ్య ఇటీవల కాలం చేయడంతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
నగరంలోని డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ లావణ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గతంలో అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన ‘రాజన్న గుండె భరోసా – రాజన్న కంటి వెలుగు’ కార్యక్రమాల్లో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ దగ్గరుండి ఉచిత వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.




