Gudur: గూడూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం!

Gudur: గూడూరు సీతమ్మ బడి వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ మెహబూబీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2026 5:51 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం!

Gudur: గూడూరు పట్టణంలోని నరసింహారావు పేట సెక్టార్ లోని సీతమ్మ బడి వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ మెహబూబీ గారి ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎంఈఓ మాధవరావు విచ్చేశారు.ఎంఈఓ మాధవరావు గారు మాట్లాడుతూ గూడూరు అర్బన్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి బాలింత, గర్భిణీ మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం వల్ల కడుపులోని బిడ్డకు మంచి బలం వస్తుందని, ప్రతిరోజు ఉదయం గుడ్డు, పాలు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు.అనంతరం సిడిపిఓ గారు మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. తల్లులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బి. హేమలత గారు, అంగన్వాడీ కార్యకర్తలు పి.వి. రమణమ్మ, టి. రాజేశ్వరి, పి. జోష్ణ, పి. సుప్రియ, టి. తులసి, ఏఎన్ఎం మాలతి మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్