Nellore: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో విసృత ప్రచారం చేసిన కూటమి నేతలు!
Nellore: పోలింగ్ సమీపిస్తుండటంతో నెల్లూరులో ప్రచారం ముమ్మరం చేసిన కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్. ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో వ్యాపారులను కలసి ఓట్ల అభ్యర్థన.
Nellore: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో విసృత ప్రచారం చేసిన కూటమి నేతలు!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రచారంలో వేగం పెంచారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మార్కెట్లో వ్యాపారులు, ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, 52వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పున్నపు విష్ణుప్రియకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు అవసరమని పేర్కొంటూ, ప్రతి ఓటు కీలకమని వివరించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని వ్యాపారులు, ఓటర్లను అభ్యర్థించారు.
ఈకార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, క్లస్టర్ ఇన్చార్జి నందిమండలం భానుశ్రీ, 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పున్నపు విష్ణుప్రియ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే మార్కెట్ కమిటీ సభ్యులు తాటిరెడ్డి, గయసుద్దీన్, కేటీఎం వెంకటేశ్వర్లు, అష్ఫాక్ హసన్, జనసేన పార్టీ 53వ డివిజన్ ఇన్చార్జి మార్కెట్ సురేష్, నవీన్ తదితరులు పాల్గొని ప్రచారంలో భాగస్వాములయ్యారు.




