Nellore: పంటపాలెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక పద్మ నామినేషన్ దాఖలు!

Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీ వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక పద్మ నామినేషన్ దాఖలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2026 7:23 AM IST
Nellore
X

Nellore: పంటపాలెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక పద్మ నామినేషన్ దాఖలు!

Nellore: ముత్తుకూరు మండలం పంటపాలెం స్వర్ణ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఆలపాక పద్మ వైసిపి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆలపాక పద్మ భర్త ఆలపాక సీనయ్య పంటపాలెం పంచాయతీలో 2006 సంవత్సరం నుండి పలుమార్లు ఎంపీటీసీగా సర్పంచులుగా పదవులు చేసి గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనుభవం కలిగి ఉన్నారు.

ప్రస్తుతం పంటపాలెం పంచాయతీ బీసీ జనరల్ రావడంతో మరలా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. ఆలపాక సేన గత వైసిపి ప్రభుత్వం లో సర్పంచ్ గా గెలుపొంది గ్రామానికి పలు సేవలు అందించారు. ఆయన సర్పంచ్ గా ఉన్న కాలంలోనే పంటపాలెం పంచాయతీకి సంబంధించి పలు పామాయిల్ ఫ్యాక్టరీలు రావడం జరిగింది.

పంటపాలెం గ్రామానికి సంబంధించి ఆలపాక పద్మ తన భర్త ఆలపాక సీనయ్య సేవలు అందించిన అనుభవం ఉంది కనుక తాము చేసిన అభివృద్ధిని చూసి తమకి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలెనని గ్రామస్తులను కోరుతునారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మారు సుధాకర్ రెడ్డి, చెంగారెడ్డి, రావి విజయ్ కుమార్ రెడ్డి, బాలస్వామి, లెనిన్, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్