Nellore: నెల్లూరు జిల్లాలో 12 అడుగుల భారీ కొండచిలువ హతం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెంలో కోళ్లను తింటూ కలకలం సృష్టించిన సుమారు 12 అడుగుల భారీ పులి పెంజర (కొండచిలువ) పామును గ్రామస్థులు హతమార్చారు.
Nellore: నెల్లూరు జిల్లాలో 12 అడుగుల భారీ కొండచిలువ హతం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామంలో తరచూ కోళ్లు మాయమవుతుందటంతో దొంగలు ఎత్తుకెళ్తున్నారని అనుమానం పడ్డారు, ఈ రోజు ముప్పాళ్ళ సుబ్బమ్మ ఇంట్లో కోళ్లు అరుస్తుందటంతో స్థానికులు అటుగా వెళ్లి చూడగా సుమారు 12అడుగులు పొడవు వున్న పులి పెంజర కోడిని చంపి కనిపించింది.
అతి కష్టం మీద పామును గ్రామస్థులు చంపేశారు. ఊరికి దగ్గర చెరువు ఉండటంతో ఇటీవల 4పాములును చంపినట్టు గ్రామస్థులు తెలిపారు. ఎపుడు ఇంత పెద్ద పాములను చూడలేదని ఇటీవల చెరువులో నీళ్లు తగ్గుముఖం పట్టడంతో ఆహారం కోసం ఇళ్లలోకి పాములు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు.




