Gudur: దళిత దేవాలయ ప్రవేశానికి వందేళ్లు: చింతామోహన్
Gudur: దళితుల ఆలయ ప్రవేశానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు.
Gudur: దళిత దేవాలయ ప్రవేశానికి వందేళ్లు: చింతామోహన్
గూడూరు: అఖండ భారత దేశంలో దళితులు హిందూ దేవాలయ ప్రవేశం చేసి, కర్పూర హారతి ఇచ్చిన చారిత్రక ఘట్టానికి వందేళ్లు పూర్తయిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తెలిపారు.
శనివారం గూడూరు టవర్ క్లాక్ కూడలిలో దళిత ఆలయ శతాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు.
1925 అక్టోబర్ 13న భారతదేశంలో మొట్ట మొదటిసారి హిందూ దేవాలయంలోకి దాసరి మురుగన్ అనే ఒక పంచముడు ప్రవేశించి, కర్పూర హారతి ఇచ్చాడని తెలిపారు. అతనిపై సెక్షన్ 295 ప్రకారం కేసు పెట్టి, తిరుపతి జైల్లో పెట్టారన్నారు. విషయం తెలుసుకున్న రాజగోపాలాచారి తిరుపతికి వచ్చి, కోర్టులో వాదనలు వినిపించి, మురుగన్ కు శిక్ష పడకుండా చేశారన్నారు. అలాగే సెక్షన్ 295 రద్దు చేయాలి జడ్జిని కోరడం జరిగిందన్నారు.
ఈ నెల 13వ తేదీ 33 మంది దళితులతో కలిసి తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుని శతాబ్ది ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. అటు తరువాత ఏడాది పాటు, ఏపీ, ఢిల్లీ, బొంబాయి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్నో ప్రాంతాల్లో చర్చా వేదికలు, సెమినార్లు నిర్వహిస్తామన్నారు.
ప్రముఖ రాజకీయ నాయకులు, న్యాయ కోవిదులు, మేధావులు హాజరవుతారని చెప్పారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిలికా, ఇసుక లో అవినీతి జరుగుతోందని, సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి వెంకటయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.




