క్యా సీన్ హై ...కారులో ప్రియురాలు..కారు బానెట్‌పై వేలాడిన భార్య!

Meerut car bonnet viral: అక్రమ సంబంధం నిలదీసిన భార్యపై కారు ఎక్కించిన భర్త. బానెట్‌ను పట్టుకుని 100 మీటర్లు వేలాడిన మహిళ.

Gagan kumar
Published on: 5 Oct 2026 11:03 AM IST
Meerut car bonnet viral
X

క్యా సీన్ హై ...కారులో ప్రియురాలు..కారు బానెట్‌పై వేలాడిన భార్య!

Meerut car bonnet viral: ఫసినీ చిత్రాల్లో చూసే రోడ్డు ప్రమాద దృశ్యాలు నిజ జీవితంలో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది..? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఒక సంచలన ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. తన భర్తను మరో మహిళతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. న్యాయం కోసం నిలదీస్తే ఆ భర్త చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కారు బానెట్‌ను గట్టిగా పట్టుకుని ప్రాణాపాయ స్థితిలో వేలాడుతున్న ఆ మహిళ రోదనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో శనివారం సాయంత్రం ఈ హైడ్రామా చోటుచేసుకుంది. కాజీపూర్‌ ప్రాంతానికి చెందిన సునీత (32) అనే మహిళ తన భర్త మయాంక్ (36) మరో మహిళతో కలిసి నగరంలో సరదాగా తినుబండారాలు తింటుండగా చూసి నిలదీసింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా మయాంక్‌ తన గర్ల్‌ఫ్రెండ్ మహీ వర్మ (34)తో కలిసి కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. భర్త మోసాన్ని సహించలేని సునీత వెంటనే తేరుకుని కారుకు అడ్డుగా నిలబడింది.

కారును ఆపేందుకు ప్రయత్నించిన భార్యను చూసి కూడా మయాంక్‌ కనీసం కనికరం చూపలేదు. ఆమెను ఢీకొట్టేలా కారును ముందుకు పోనిచ్చాడు. ప్రాణభయంతో సునీత సరాసరి కారు బానెట్‌ను గట్టిగా పట్టుకుని వేలాడింది. అయినప్పటికీ మయాంక్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు.

బానెట్‌పై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాదాపు 100 మీటర్ల దూరం ప్రయాణించిన సునీత.. దారిన వెళ్లేవారిని చూసి కాపాడండి అంటూ బిగ్గరగా వేడుకున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో, స్థానికుల మొబైల్స్‌లో రికార్డయ్యాయి. ఈ భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

స్థానికులు ఒక్కసారిగా రోడ్డుపై గుమికూడి కేకలు వేయడంతో చేసేది లేక మయాంక్ కారును ఆపక తప్పింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బాధితురాలు సునీత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మేరఠ్‌ పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు నడిపిన భర్త మయాంక్, అతడి గర్ల్‌ఫ్రెండ్ మహీ వర్మపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, ఈ దురాగతానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.