Kerala lodge gang rape: కేరళ కేసులో ఊహించని ట్విస్ట్...భర్త లవర్‌పై గ్యాంగ్ రేప్ చేయించిన భార్య
Kerala lodge gang rape: కేరళ లాడ్జీలో జంటను కిడ్నాప్ చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.
Kerala lodge gang rape: కేరళ కేసులో ఊహించని ట్విస్ట్...భర్త లవర్‌పై గ్యాంగ్ రేప్ చేయించిన భార్య
Kerala lodge gang rape: తాము పోలీసులమంటూ గదిలోకి వచ్చి.. క్షణాల వ్యవధిలో కాళ్లు, చేతులు కట్టేసి ఇద్దరినీ కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత దారుణానికి పాల్పడటం.. కేరళలో సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటనలో పోలీసులే విస్మయం చెందేలా ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యానికి వేరే ఎవరూ కారణం కాదు.. స్వయంగా ప్రియుడి భార్యే పక్కా వ్యూహంతో సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తేలడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి గత నెలలో కేరళలోని త్రిస్సూర్ వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సడన్‌గా గదిలోకి ప్రవేశించిన కొద్దిమంది తాము పోలీసులమని నమ్మబలికారు.
ఇద్దరి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా కారులోకి ఎక్కించి తమిళనాడుకు తరలించారు. ఈ ప్రయాణంలో ప్రియుడిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఆ తర్వాత అతడిని తిరుప్పూర్‌లోని ఆసుపత్రి సమీపంలో పడేసి వెళ్లారు. ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను వేరే కారులోకి మార్చి అత్యంత అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన తమిళనాడు, కేరళ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసును త్రిశూర్ సిటీ పోలీసులకు బదిలీ చేయగా, వారు జరిపిన విచారణలో సినిమాను తలపించే అసలు నిజాలు బయటపడ్డాయి. బాధిత మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియుడి భార్యే ఈ మొత్తం వ్యూహానికి సూత్రధారిగా తేలింది. భర్త కదలికలపై నిఘా పెట్టేందుకు అతడి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ఆమె నిరంతరం ట్రాక్ చేస్తూ వచ్చింది.వారు త్రిస్సూర్ లాడ్జ్‌లో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం తెలుసుకున్న భార్య.. ఎలాగైనా గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఒక క్రిమినల్ గ్యాంగ్‌ను ఆశ్రయించి సుపారీ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం ఆ గ్యాంగ్ లాడ్జ్‌పై దాడి చేసి ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, పక్కా ఆధారాలతో భార్యతో సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.భర్త ప్రవర్తనపై కోపంతో ఏకంగా సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి, ఒక మహిళ పట్ల ఇంతటి దారుణానికి తెగబడిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.




