Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు!
Helicopter Crash: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలి ప్రమాదం. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా ఘటన, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం.
Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు!
Helicopter Crash: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లా సరిహద్దుల్లో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదశాత్తు కుప్పకూలిపోవడం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణికులతో బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు.. మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. దాంతో వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక యంత్రాంగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలాన్ని గుర్తించి బాధితులను కాపాడేందుకు అధికారులు విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గాలింపు చర్యలను వేగవంతం చేయడానికి మరో రెండు సహాయక హెలికాప్టర్లను కూడా సెర్చ్ ఆపరేషన్‌లో మోహరించారు.
అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్రమైన పొగమంచు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండటంతో గాలింపు చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోందని సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు మరియు ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




