Vijay: నన్ను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారు.. డీఎంకేకు విజయ్ సంచలన హెచ్చరిక!
Vijay: తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. డీఎంకేకు టీవీకే అధినేత విజయ్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. తనను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారంటూ హెచ్చరించారు.
Vijay: నన్ను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారు.. డీఎంకేకు విజయ్ సంచలన హెచ్చరిక!
Vijay: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత వేడెక్కుతున్నాయి. అధికార డీఎంకే (DMK) పార్టీకి, టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా డీఎంకేను టార్గెట్ చేస్తూ విజయ్ మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తనను టచ్ చేయాలని చూడొద్దని, ఒకవేళ అలా చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో మధురాంతకంలో టీవీకే అభ్యర్థి కుమరవేల్కు మద్దతుగా విజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌పై మరియు డీఎంకే తీరుపై మండిపడ్డారు. గతంలో జయలలితను స్టాలిన్ విమర్శించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతోందని గుర్తుచేశారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలోని ప్రముఖ నాయకులు కూడా మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. డీఎంకే నేతల ఈ వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
డీఎంకేకు తాను స్పష్టంగా చెబుతున్నానని.. అవినీతికి పాల్పడిన ఈ గుంపును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయ్ హెచ్చరించారు. గతంలో జయలలితకు ఏవిధంగా అయితే డీఎంకే ప్రధాన శత్రువుగా ఉందో, నేడు తమ టీవీకే పార్టీకి కూడా డీఎంకేనే ప్రధాన శత్రువు అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో నియోజకవర్గాల బిల్లు వస్తే మద్దతు ఇచ్చేందుకు డీఎంకే ఎంతో ఆత్రుతగా తహతహలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.




