Bihar Boat Accident: బిహార్లో ఘోర పడవ ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి!
Bihar Boat Accident: బిహార్లోని వైశాలి జిల్లా రాఘోపూర్ సమీపంలో గంగానదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Bihar Boat Accident: బిహార్లో ఘోర పడవ ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి!
Bihar Boat Accident: ఆనందంగా గడపాల్సిన ఓ వేడుక ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బిహార్లో జరిగిన ఒక ఘోర పడవ ప్రమాదం పన్నెండు కుటుంబాల్లో చీకటిని మిగిల్చింది. మహిళలు, చిన్నారుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. బిహార్లోని వైశాలి జిల్లా రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ శ్యామ్చంద్ గ్రామ సమీపంలో గంగానదిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
స్థానిక సమాచారం ప్రకారం.. ఒక విందు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ప్రయాణికులతో కూడిన పడవ గంగానది మధ్యలోకి రాగానే ఒక్కసారిగా బోల్తా పడింది. పడవలో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు, మహిళలు ఉండటంతో వారు నీటిలో మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నదిలో కొట్టుకుపోతున్న వారిలో ముగ్గురిని స్థానికులు ఎంతో సాహసించి సురక్షితంగా కాపాడగా, తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి సమయం కావడంతో రెస్క్యూ ఆపరేషన్కు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఈ హృదయవిదారక ఘటన పట్ల బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూDాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారి ప్రాణాలు గంగమ్మ ఒడిలో కలిసిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నదీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు తగిన భద్రతా చర్యలు పాటించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.




