Tiger: నడిరోడ్డుపై దర్జాగా తిరిగిన పులి.. వీడియో వైరల్!

Tiger: రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి దారి తప్పిన ఓ పులి రాత్రి సమయంలో అల్వార్ రోడ్డుపై సంచరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 7 Oct 2026 11:17 AM IST
Tiger: నడిరోడ్డుపై దర్జాగా తిరిగిన పులి.. వీడియో వైరల్!
X

Tiger: రాత్రి సమయంలో నడిరోడ్డుపై పులి దర్జాగా తిరుగుతోన్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై పులి సంచరించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి దారి తప్పిన ఒక పెద్ద పులి.. రాత్రి సమయంలో అల్వార్ పట్టణంలోని నడిరోడ్డుపై స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపించింది.

అల్వార్-జైపూర్ ప్రధాన రహదారిపై పులి తిరుగుతుండటాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు సరిస్కా అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. పులి సంచరించిన ప్రాంతాల వైపు ప్రజలు ఎవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు.

రోడ్డుపై దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న పులి కదలికలను కొందరు వాహనదారులు తమ మొబైల్స్‌లో బంధించడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బంది పులిని సురక్షితంగా అడవిలోకి తరిమే ప్రయత్నాలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.