Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. కుల్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు
Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. కుల్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు
Terror Attack: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లాలోని ఒక సీఆర్పీఎఫ్ (CRPF) క్యాంప్‌పై బుధవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు వెంటనే ఎదురుకాల్పులు జరపడంతో.. ఉగ్రవాదులు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పరారయ్యారు.
ఈ కాల్పుల్లో గాయపడిన జవాన్లను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్సనందిస్తున్నారు. ఘటన అనంతరం అప్రమత్తమైన భద్రతా బలగాలు క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) సహాయంతో క్యాంపు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులు పాకిస్థానీ ఉగ్రమూకలకు చెందినవారిగా భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.




