CM Vijay: ఇంద్రకీలాద్రిపై సీఎం విజయ్.. విజయవాడలో అభిమానుల సందడి!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

G Krishna
Published on: 13 Oct 2026 5:37 PM IST
CM Vijay
X

CM Vijay: ఇంద్రకీలాద్రిపై సీఎం విజయ్.. విజయవాడలో అభిమానుల సందడి!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు విజయ్‌కు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని ఇచ్చారు.

కనకదుర్గమ్మ దర్శనం అనంతరం విజయ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు బయల్దేరనున్నారు. అలాగే, ఈ రాత్రి విజయవాడలో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్‌’లో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి ఏపీకి రావడంతో ఆయన పర్యటనపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

విజయ్ రాక నేపథ్యంలో విజయవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయ్‌ను చూసేందుకు ఉత్సాహం చూపిన అభిమానులు, ఆయన ప్రయాణిస్తున్న కారు వెంట పరుగులు తీశారు. దీంతో నగరంలో ఆయన పర్యటన చర్చనీయాంశంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.