Supreme Court: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. వీలైతే ముందే శిక్షించండి..
Supreme Court: డిజిటల్ అరెస్టులంటే డిజిటల్ దోపిడీనే అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశం.
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. వీలైతే ముందే శిక్షించండి..
Supreme Court: దేశవ్యాప్తంగా అమాయకులను భయాందోళనలకు గురిచేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సైబర్ నేరాలను సర్వోన్నత న్యాయస్థానం "డిజిటల్ దోపిడీ"గా అభివర్ణించింది. ఇలాంటి డిజిటల్ దొంగలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని, సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు కఠినంగా ఆదేశించింది.
"మా అభిప్రాయం ప్రకారం.. డిజిటల్ అరెస్టులంటే డిజిటల్ దోపిడీనే. వీడియో కాల్స్ ద్వారా ఈ దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి కఠిన శిక్షలు పడాల్సిందే. విచారణ పూర్తికాకముందే నేరస్థులను శిక్షించేందుకు చట్టంలో ఏదైనా ప్రత్యేక అవకాశం ఉంటే, దానిని తక్షణమే ఉపయోగించాలి."
డిజిటల్ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) అన్నింటినీ ఒకే చోటకు చేర్చి క్లబ్ చేయాలని నిందితులు వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం నిర్దాక్షిణ్యంగా కొట్టివేసింది. "నిందితుల సౌలభ్యం కోసం బాధితులను ఇబ్బంది పెట్టలేం" అని తేల్చి చెప్పిన ధర్మాసనం, సైబర్ నేరగాళ్లకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.




