Supreme Court: ‘మీకు నచ్చకపోతే మీరూ సినిమా తీయండి’.. రామాయణ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Supreme Court: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణ’ సినిమాపై దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 27 Nov 2026 1:04 PM IST
Supreme Court
X

Supreme Court: ‘మీకు నచ్చకపోతే మీరూ సినిమా తీయండి’.. రామాయణ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Supreme Court: నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇతిహాసాన్ని భిన్నంగా అర్థం చేసుకునేవారు తమ అభిప్రాయాలకు అనుగుణంగా మరో సినిమా తీసుకోవచ్చని, ఈ అంశంపై కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

‘రామాయణ’ సినిమాను సవాలు చేస్తూ నవంబర్ 23న పిటిషన్ నమోదైందని, ఇప్పటివరకు విచారణకు రాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సినిమాలో అనేక పౌరాణిక వాస్తవాలను వక్రీకరించారని వాదించారు.

న్యాయవాది వాదనలపై జస్టిస్ బాగ్చి స్పందిస్తూ.. "వారు తమకు అర్థమైన విధంగా సినిమా తీశారు. మీకు అర్థమైన విధంగా మీరూ సినిమా తీయండి. కోర్టు సమయాన్ని వృథా చేయకండి. ఇతిహాసంపై మీకేమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. దాని ఆధారంగా మరో సినిమా రూపొందించండి" అని స్పష్టం చేశారు.

సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైందని, చూడాలనుకున్నవారు చూసేశారని ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా చేపట్టాలని న్యాయవాది కోరగా, తగిన సమయంలో పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని స్పష్టం చేసింది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.