Supreme Court: బిహార్ ‘సర్’ కేసులో ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం: "ఫారం-6 సవరణలను మేం ఆమోదించలేదు!"
Supreme Court: బిహార్ ‘సర్’ (SIR) ప్రక్రియలో ఫారం-6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది.
Supreme Court: బిహార్ ‘సర్’ కేసులో ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం: "ఫారం-6 సవరణలను మేం ఆమోదించలేదు!"
Supreme Court: బిహార్ ‘సర్’ (SIR) ప్రక్రియకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6 (Form-6) మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ ఫారంలో తాము ఎలాంటి సవరణలను ఆమోదించలేదని, అలాగని తిరస్కరించలేదని ప్రధాన జస్టిస్ (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బిహార్ సర్‌కు సంబంధించి తీర్పు వెలువడిన సమయంలో ఈ సవరించిన కొత్త ఫారం-6 లేదని పేర్కొంది.
కొత్త ఫారం డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఎన్నికల సంఘం (ECI) ప్రచారం చేసిందన్న వాదనపై విచారణ సందర్భంగా ఈ స్పష్టత వెలువడింది. చట్టబద్ధమైన నిబంధనలు మార్చకుండా ఎన్నికల సంఘం ఫారం-6లో ఏకపక్షంగా మార్పులు చేసిందని, పైగా ఆ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని తప్పుడు ప్రచారం చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం.. తాము ఆ సవరణలను ఎప్పుడూ పరిశీలించలేదని, కాబట్టి వాటిని ఆమోదించినట్లుగా గానీ, వ్యతిరేకించినట్లుగా గానీ భావించలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి పూర్తి రికార్డులు అందిన తర్వాత ఫారంలో మార్పులు ఎవరు చేశారనేదానిపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.




