Sonam Wangchuk: నన్ను ఎన్‌కౌంటర్‌లో చంపేయవచ్చు.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు!
Sonam Wangchuk: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను ఎన్‌కౌంటర్‌లో హతమార్చే అవకాశం ఉందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ఆరోపణలు చేశారు.
Sonam Wangchuk: నన్ను ఎన్‌కౌంటర్‌లో చంపేయవచ్చు.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు!
Sonam Wangchuk: ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నందుకు తనను ఎన్‌కౌంటర్‌లో హతమార్చే అవకాశం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అనుమానం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, దాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు పరిధిలోకి చేర్చాలని కోరుతూ గత సంవత్సరం సెప్టెంబరు 24న లేహ్‌లో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
లేహ్‌లో జరిగిన ఆందోళనల్లో నలుగురు మరణించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. లేహ్ హింసకు ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయని, దేశాన్ని మేల్కొలిపేందుకు ఎలాంటి పర్యవసానాన్నైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. "నన్ను ఇప్పటికే జైల్లో పెట్టారు.. ఇప్పుడు ఏదో ఒకచోట నన్ను ఎన్‌కౌంటర్ చేసి హతమార్చవచ్చు కూడా. అది దేశానికి మేల్కొలుపు అవుతుంది" అని పేర్కొన్నారు.
గతేడాది జరిగిన లేహ్ అల్లర్లపై నిర్వహించిన న్యాయ విచారణ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ నివేదికను బయటపెట్టకపోతే, లేహ్‌లో జరిగిన పోలీసు కాల్పులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక 'ప్రజా ట్రైబ్యునల్'ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.




