Parlakhemundi: గుసానిలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహణ
Parlakhemundi: గజపతి జిల్లా గుసానిలో సేవా సంకల్ప్ అభియాన్ ఘనంగా నిర్వహించారు; అక్టోబర్ 7న పర్లాఖెముండిలో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Parlakhemundi: గుసానిలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహణ
పర్లాఖెముండి: గజపతి జిల్లా.. గుసాని సమితి కార్యాలయంలో శనివారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్యేక అభివృద్ధి కౌన్సిల్ అధ్యక్షుడు కామాదేవ్ బడ నాయక్, అతిథులుగా సమితి అధ్యక్షుడు ఎన్ వీర్రాజు,సేవా సంకల్ప అభియాన్ కోఆర్డినేటర్ గేదెల శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బడ నాయక్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పై ప్రజల అవగాహన కల్పించడంతోపాటు గ్రామాల్లో పారిశుధ్యం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు కోరారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సమితి అభివృద్ధి అధికారి గౌర చంద్ర పట్నాయక్, బిసీసీఐ డైరెక్టర్ బల్ల ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పర్లాఖెముండి లోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం పై జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పట్టణంలోని జగన్నాథ మందిర ప్రాంతాల నుంచి గజపతి క్రీడా మైదానం వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హోన్నాగా , జిల్లా సాంస్కృతిక అధికారిణి అర్చన కుమారి మంగరాజ్, జిల్లా క్రీడా అధికారి త్రినాధ్ సాహు, జిల్లా పరిషత్ అదనపు కార్య నిర్వహణ అధికారి పృధ్విరాజ్ మండల్ తదితరులు పాల్గొన్నారు.




