Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి 8 మంది కార్మికులు దుర్మరణం!

Rajasthan: రాజస్థాన్‌ ఛపోలి గ్రామంలో ఘోర విద్యుత్ ప్రమాదం. రోడ్డు పనుల్లో కాంక్రీట్ మిక్సర్‌కు హైటెన్షన్ వైర్ తగిలి ఎనిమిది మంది కార్మికులు మృతి.

Arun Chilukuri
Published on: 2 Nov 2026 5:02 PM IST
Rajasthan
X

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి 8 మంది కార్మికులు దుర్మరణం!

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులను విద్యుదాఘాతం బలితీసుకుంది. రాజస్థాన్‌లోని గుడా గౌడ్‌జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపోలి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, కూలీలు యంత్రం (కాంక్రీట్ మిక్సర్) సహాయంతో కంకరను కలుపుతున్నారు.

అయితే పనులు జరుగుతున్న ప్రదేశం పైభాగంలో ఉన్న హై-టెన్షన్ (హైవోల్టేజ్) విద్యుత్ తీగలను కాంక్రీట్ యంత్రం ప్రమాదవశాత్తు తాకడంతో భారీ విద్యుత్ షాక్ కొట్టింది. విద్యుదాఘాత తీవ్రతకు యంత్రం వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరో ముగ్గురు మరణించారు.

దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.