BJP: రాహుల్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. బీజేపీ నేతల సెటైర్లు!

BJP: దేశ రాజకీరాల్లో ఎప్పుడూ ఏదో ఒక మంట పుడుతూనే ఉంటుంది. ఈసారి ఆ మంట కాస్తా నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మొబైల్ ఫోన్ నుంచి రాజుకుంది.

G Krishna
Published on: 13 Nov 2026 7:19 PM IST
BJP
X

BJP: రాహుల్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. బీజేపీ నేతల సెటైర్లు!

BJP: దేశ రాజకీరాల్లో ఎప్పుడూ ఏదో ఒక మంట పుడుతూనే ఉంటుంది. ఈసారి ఆ మంట కాస్తా నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మొబైల్ ఫోన్ నుంచి రాజుకుంది. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు!" అంటూ రాహుల్ గారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది. ప్రధానితో డిబేట్‌కు ఆహ్వానించిన ఆయన, మధ్యలో ఈ ఫోన్ ట్యాపింగ్ లొల్లి ఎందుకు తెచ్చారో కానీ.. బీజేపీ నేతలకైతే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంకేముంది, కాషాయ పార్టీ నేతలంతా క్యూ కట్టి మరీ రాహుల్ గారిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫోన్ ఇస్తే పోయేదేముంది.. లేక కరిగిపోతుందా?

రాహుల్ గారి ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రతినిధి ఆర్.పి. సింగ్ ఇన్‌స్టంట్ పంచ్ ఇచ్చారు. "అయ్యా రాహుల్ జీ.. మీ ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉంటే, దాన్ని తీసుకెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయండి. అలా చేస్తే అసలు నిజం బయటపడుతుంది కదా.. సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు మొబైల్ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇప్పుడు మళ్లీ కొత్త రోదన మొదలుపెట్టారు. కేవలం వార్తల్లో నిలవడానికే ఆయన రోజొక అబద్ధం చెబుతుంటారు" అని సెటైర్లు వేశారు. ఇక యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అయితే మరింత వెటకారంగా స్పందిస్తూ.. "ఎవరో విదేశీయులు రాహుల్ గాంధీని హ్యాక్ చేశారులేండి.. ఆయన ఫోన్‌ను వేరే వాళ్ళు హ్యాక్ చేయాల్సిన పనేముంది?" అంటూ ఎద్దేవా చేశారు.

ఎవిడెన్స్ ఏది స్వామి.. విదేశాలకు వెళ్లినా దొరకలేదా?

మరో బీజేపీ నేత తుహిన్ సిన్హా అయితే రాహుల్ గారిని గట్టిగానే ఆడుకున్నారు. "ఆయనకు ఆధారాలు చూపించడం చేతకాదు, అందుకే రోజుకో కొత్త ఆరోపణ చేస్తారు. నెల రోజుల క్రితం రాష్ట్రపతిని కలిసి ఓట్ల చోరీకి సంబంధించి ఎవిడెన్స్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఆ జాడ లేదు. విదేశాలకు వెళ్లొచ్చారు అక్కడ కూడా ఏ ఆధారమూ దొరకలేదు. ఇప్పుడు మళ్లీ ఫోన్‌లోనే అసలు సాక్ష్యాలు ఉన్నాయంటూ కొత్త నాటకానికి తెరతీశారు. ఆ ఫోన్‌లో ఏమున్నాయో ఏమో!" అంటూ చురకలంటించారు. ఇక నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. "ముందుగా నో ఆధారాలు.. ఆ తర్వాత విచిత్రమైన ఆరోపణలు.. ఆ వెంటనే ప్రధానితో డిబేట్ కావాలంటూ డిమాండ్ చేయడం రాహుల్ గారికి అలవాటుగా మారిపోయింది. దమ్ముంటే పార్లమెంట్‌కు వచ్చి రూల్స్ ప్రకారం డిబేట్ చేయండి" అని హితవు పలికారు.

కాంగ్రెస్ కౌంటర్లు.. 'ఆ భయమే కారణం!'

మరోవైపు కాంగ్రెస్ వాళ్లు కూడా తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రతిపక్ష నేత ఫోనే ట్యాప్ అవుతుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ జీ మాటలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని సల్మాన్ ఖుర్షీద్ అంటుంటే.. ప్రధాని మోదీకి రాహుల్ అంటే భయం పట్టుకుందని, అందుకే ఈ ట్యాపింగ్ డ్రామాలు నడుస్తున్నాయని ఇమ్రాన్ మసూద్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి రాహుల్ గారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఏ రేంజ్‌లో నవ్వులు పూయిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.