దిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. తమిళనాడులో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ కీలక సమావేశం!
తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీవీకే చీఫ్, సీఎం విజయ్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారు.
దిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. తమిళనాడులో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ కీలక సమావేశం!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తో సమావేశమయ్యారు. నీలంకరైలోని విజయ్ నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విజయ్, రాహుల్ గాంధీ దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై పలు కీలక జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సమీపంలోని ఒక కేఫ్‌కు వెళ్లి కాఫీ, స్నాక్స్ తీసుకున్నారు.
దేశ రాజధాని దిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ 'ఇండియా' కూటమి నిరసనలు చేపట్టినప్పటికీ, టీవీకే పార్టీ మాత్రం ఆ ఆందోళనలకు కొంత దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ నేరుగా విజయ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీ ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ హోటల్‌కు వెళ్లగా.. సాయంత్రం చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. యువతను ఉద్దేశించి జరిగే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి మాట్లాడనున్నారు.




