Lottery: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన డ్రైవర్.. దీపావళి లాటరీలో రూ.12 కోట్లు!

Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం.

Arun Chilukuri
Published on: 18 Nov 2026 11:43 AM IST
Lottery
X

Lottery: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన డ్రైవర్.. దీపావళి లాటరీలో రూ.12 కోట్లు!

Lottery: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సామాన్యులను సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఓ సాధారణ ట్రక్కు డ్రైవర్‌ను అదృష్టం రూ.12 కోట్ల దీపావళి లాటరీ రూపంలో వరించింది.

మొహాలీ ప్రాంతానికి చెందిన బల్జిందర్ సింగ్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత 15 ఏళ్లుగా ప్రతి పండుగ సీజన్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం అతడికి అలవాటు. ఈ క్రమంలో ఇటీవల దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన ‘పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్’ లాటరీలో రూ.500 పెట్టి ఓ టికెట్ కొన్నాడు. ఎట్టకేలకు అతడు కొన్న టికెట్‌కే మొదటి బహుమతి (రూ.12 కోట్ల జాక్‌పాట్) దక్కింది.

తనకు లాటరీ తగిలిన విషయం తెలిసి బల్జిందర్ సింగ్ ఆనందంతో పొంగిపోయాడు. తన కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఇన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నానని, 15 ఏళ్ల తర్వాత తనను అదృష్టం వరించిందని తెలిపాడు. ‘‘లాటరీ తగిలిన విషయం తెలిసి నా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని నా ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఉపయోగిస్తాను’’ అని బల్జిందర్ సింగ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.