PM Modi: మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన!

PM Modi: నవంబర్ 30న లోక్‌సభలో డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 28 Nov 2026 3:10 PM IST
PM Modi
X

PM Modi: మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన!

PM Modi: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ నెల 30న (సోమవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసి తీరుతుందని, దీనిని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల సాధన కోసం దేశంలో దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని గుర్తుచేసిన ప్రధాని మోదీ, ఆ పోరాటంలో తాను కూడా ఒకడినని పేర్కొన్నారు. మహిళల హక్కుల సాధనకు అడ్డుగా ఉన్న అన్ని అవరోధాలను తమ ప్రభుత్వం తొలగిస్తుందని భరోసా ఇచ్చారు.

దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని, 'నారీ శక్తి' సాధికారత కోసం తమ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటుందని ప్రధాని తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా నవంబర్ 30న లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనుండటంతో దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.