Paralakhemundi: అటవీ, ఎక్సైజ్ శాఖ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు!
Paralakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాకిమిడిలో అటవీ, ఎక్సైజ్ శాఖ ఉద్యోగాల అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అధికారులు పర్యవేక్షించారు.
Paralakhemundi: అటవీ, ఎక్సైజ్ శాఖ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు!
Paralakhemundi: గజపతి జిల్లాలో ఫారెస్టు గార్డు, ఫారెస్టర్, ఎక్సైజ్ శాఖలో 16 పోస్టుల భర్తీ కోస్తీ 6 రోజుల క్రితం రాత పరీక్ష జరిగింది. అందులో ఎంపికైన అభ్యర్థులకు సోమవారం గజపతి స్టేడియంలో అధికారుల సమక్షంలో దేహదారుఢ్య పరీక్షలు, హైజంప్, లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించారు. ఏడీఎం పల్లవి మధు, డీఎస్పీ నిరంజన్ బెహెరా, ఏపీఎస్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, అటవీ శాఖ ఏ.సి.ఎఫ్.
ఫైనెస్త్రీదాస్, దేవగిరి రేంజ్ అధికారి అమిత్ సుప్రజిత్, పీఈటీ (స్పోర్ట్స్) సురేంద్ర పాత్రో, ఇతర అధికారులు ఫిజికల్ పరీక్షలను పరిశీలించారు. వీరిలో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. మంగళవారం వారికి రాజీపేట నుంచి 15 కిలోమీటర్ల వరకు పందెం పోటీలను నిర్వహిస్తామని ఏసీఎఫ్ ఫైనెస్త్రీదాస్ తెలిపారు.




