Parlakhemundi: పర్లాఖెముండిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి 70 మంది అరెస్ట్!
Parlakhemundi: ఒడిశాలోని పర్లాఖెముండి దేవిది గ్రామంలో ఓ కళ్యాణ మండపంలో జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 70 మందిని అరెస్ట్ చేశారు. రూ. 12 లక్షలు, వాహనాలు స్వాధీనం.
Parlakhemundi: పర్లాఖెముండిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి 70 మంది అరెస్ట్!
Parlakhemundi: పేకాట ఆడుతున్న ఓ స్థావరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. ఇలాంటి ఘటన గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ ఆదర్శ ఠాణా పరిధిలోని దేవిది గ్రామ ప్రాంతంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో సుమారు 70 మందితో పేకాట జరుగుతుందని సమాచారం అందుకున్న డీఎస్పీ అమితాబ్ పండా ఠాణా అధికారి ప్రశాంత్ భూపతి తో పాటు కాశీనగర్,గారబంద ఠాణా అధికారులు ప్రత్యేక బృందంతో దాడి చేశారు.
అనంతరం వారందరిని అరెస్టు చేసి ఠాణా కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 12 లక్షలు సొమ్ముతోపాటు, 9కార్లు, 60 చరవాణిలు తో పాటు 10 కి పైగా ద్విచక్ర వాహనాలు లభించాయని, వీటితోపాటు పదుల సంఖ్య నెంబర్ లో ఉన్న టోకెన్లు దొరికినట్లు తెలిపారు.




