Parlakhemundi: 10 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లాలో తుఫాను ముప్పుపై ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ సమీక్ష. 10 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు, 100 పోక్లైన్లు సిద్ధం.

S.Anil, Gajapati Dst
Published on: 28 Oct 2026 7:04 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: 10 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు!

Parlakhemundi: గజపతి జిల్లాలో తుపాను ప్రాంతాలపై సమీక్షించేందుకు ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. గండాహాతి పంచాయతీలోని కించిలింగి గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సూరజ్ పరిశీలించారు.

కొండచరియలు, చెట్లు నేలకొరిగిన ప్రాంతాల్లో తక్షణమే తొలగించేందుకు 100 పోక్లైన్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా నోడల్ అధికారి బిజయ్ కుమార్ దాస్, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ తో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst