43వ అంతస్తు నుంచి దూకిన యువకుడు.. రెండు ముక్కలైన శరీరం.!

Noida Supernova: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 94 పరిధిలోని విలాసవంతమైన 'సూపర్‌నోవా' సొసైటీలో శనివారం అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది.

G Krishna
Published on: 3 Oct 2026 4:12 PM IST
Noida Supernova
X

43వ అంతస్తు నుంచి దూకిన యువకుడు.. రెండు ముక్కలైన శరీరం.!

Noida Supernova: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 94 పరిధిలోని విలాసవంతమైన 'సూపర్‌నోవా' సొసైటీలో శనివారం అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. సొసైటీలోని 'అస్పైర్ టవర్' 43వ అంతస్తు నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో ఆ తీవ్రతకు బాధితుడి శరీరం రెండు ముక్కలుగా తెగిపడింది.

అతను కిందపడిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో భవన సముదాయంలో ఉన్న నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దిగ్భ్రాంతికర దృశ్యాలను కింద ఉన్న స్థానికులు తమ ఫోన్లలో రికార్డు చేయడంతో సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

'డిప్రెషన్‌లో ఉన్నా' అని చెబుతూ దుముకిన యువకుడు

ప్రాథమిక వివరాల ప్రకారం, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు సూపర్‌నోవాలోని ఒక 'ఎయిర్‌బీఎన్‌బీ' (AIR BNB) రూమ్‌లో బస చేస్తున్నట్లు తెలిసింది. అతను భవనం పైనుంచి దూకే సమయంలో అక్కడే ఉన్న ఒక ఏసీ మెకానిక్ అతనిని వారించేందుకు, కాపాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే, తాను తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్)లో ఉన్నానని చెబుతూ ఆ యువకుడు కిందకు దూకేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

గ్రేటర్ నోయిడాలో ఎంసీఏ విద్యార్థి బలవన్మరణం

ఇదిలా ఉండగా, గత నెలలోనూ నోయిడా పరిధిలో ఇలాంటిదే మరొక విషాద సంఘటన వెలుగుచూసింది. గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిగల సెక్టార్ ఆల్ఫా-2 లో ఒకటో సంవత్సరం ఎంసీఏ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాకు చెందిన అభిషేక్‌‌గా పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఎంసీఏ చదువుతున్న అతను నెల క్రితమే ఇక్కడికి మారినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ (FSL) బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.