అజిత్ పవార్ మరణంతో ముగిసిన విలీనం కథ.. సుప్రియా సూలే సంచలన ప్రకటన!
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు గుట్ల విలీన వార్తలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు.
అజిత్ పవార్ మరణంతో ముగిసిన విలీనం కథ.. సుప్రియా సూలే సంచలన ప్రకటన!
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు గుట్ల విలీన వార్తలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్సీపీ రెండు వర్గాలు ఒక్కటవుతాయన్న ప్రచారానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టారు. తన అన్న అజిత్ పవార్ మరణం తర్వాత ఇక ఈ విలీన ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
అజిత్ పవార్‌తో చర్చలు జరిగాయి.. తారీఖూ ఫిక్స్ అయింది
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయన్న వార్తలపై స్పందిస్తూ.. అజిత్ పవార్ జీవించి ఉన్న సమయంలో రెండు పార్టీల కలయికపై నిజంగానే చర్చలు జరిగాయని సుప్రియా సూలే వెల్లడించారు. ఈ దిశగా చర్చలు చాలా దూరం వెళ్లాయని, చివరికి విలీనానికి సంబంధించి ఒక తేదీని కూడా ఖరారు చేసుకున్నామని తెలిపారు. అయితే, ఆ తేదీ ఎప్పుడనేది ఆమె బయటపెట్టలేదు.
"ఇక ఆ విషయమే మాట్లాడను"
కానీ, ఇంతలోనే విధి మరోలా తలచింది. అజిత్ పవార్ అకస్మిక మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని సుప్రియా సూలే ఉద్వేగానికి గురయ్యారు. చేతులు జోడించి మీడియాను కోరుతూ.. "నా అన్న ఇప్పుడు నడుమ లేడు.. ఇక విలీనం గురించి మాట్లాడటంలో అర్థం లేదు.
అజిత్ దాదా నిష్క్రమణతో ఈ విలీన అధ్యాయం శాశ్వతంగా ముగిసింది" అని తేల్చిచెప్పారు. భవిష్యత్తులోనూ ఎవరైనా ఈ విషయంపై ప్రశ్నించినా తాను ఎలాంటి సమాధానం ఇవ్వబోనని స్పష్టం చేశారు. అజిత్ వర్గం నుంచి తమకు ఎలాంటి కొత్త సందేశాలు, ఫోన్ కాల్స్ లేదా ప్రతిపాదనలు రాలేదని, ఎన్డీయేలో చేరికపై ఎలాంటి చర్చ జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందన
ఇదే సమావేశంలో ఎంపీ సంజయ్ రౌత్ రాసిన వ్యాసాలు, చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. సంజయ్ రౌత్ తనకు పెద్ద అన్న లాంటి వారని, ఆయనకు ఏది సరిగ్గా అనిపిస్తే అది రాసే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై స్టాండ్
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందిస్తూ ఈ విషయంపై తనకు పూర్తి వివరాలు తెలియవని, దీనిపై రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరేలతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని చెప్పారు. ఎవరి ఫోన్లయినా ట్యాప్ చేయడం కచ్చితంగా తప్పేనని ఆమె అభిప్రాయపడ్డారు.
అలాగే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లకు తాము మొదటి నుంచి మద్దతు ఇస్తున్నామని, మూడు నెలల క్రితం ఏ అభిప్రాయంతో ఉన్నామో ఇప్పుడూ అదే వైఖరితో ఉన్నామని సుప్రియా సూలే స్పష్టం చేశారు.




