కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించలేదు.. డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదన్న స్టాలిన్

MK Stalin: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంలో డీఎంకే తన 'ఫెయిర్ డీలిమిటేషన్' వైఖరికే కట్టుబడి ఉందని ఆ పార్టీ స్పష్టం చేసింది.

G Krishna
Published on: 29 Nov 2026 7:16 PM IST
MK Stalin
X

కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించలేదు.. డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదన్న స్టాలిన్

MK Stalin: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంలో డీఎంకే తన 'ఫెయిర్ డీలిమిటేషన్' వైఖరికే కట్టుబడి ఉందని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశం అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమ వైఖరిని ఎందుకు సడలించడం లేదో వివరించారు. బిల్లును వ్యతిరేకించాలంటూ నేతలు కోరినప్పటికీ, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే తేల్చిచెప్పింది.

సమావేశం తర్వాత స్టాలిన్ ఏమన్నారంటే..

సమావేశం అనంతరం డీఎంకే ఐటీ వింగ్ విడుదల చేసిన ప్రకటనలో స్టాలిన్ మాట్లాడుతూ, డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరిని చర్చించేందుకే కాంగ్రెస్ నేతలు కలిశారని తెలిపారు. ముందు రోజు ఎంపీల సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని వారికి వివరించామని, ఈ అంశంపై తాము చేస్తున్న పోరాటాన్ని కూడా చెప్పామని పేర్కొన్నారు. డీఎంకే తమ వైఖరిని అంగీకరించారని, సమావేశంలో ఇతర అంశాలపైనా చర్చ జరిగిందని స్టాలిన్ చెప్పారు. అయితే నిర్ణయంలో మార్పు గానీ, కొత్త పరిష్కారం గానీ కనిపించలేదు. ప్రతిపాదిత బిల్లు ఓడిపోతే తమిళనాడుకు ఉన్న ప్రస్తుత వాటా కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

మునుపటి అంచనాలు.. మారిన వైఖరి వెనుక లెక్కలు

డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్‌లో తమిళనాడు ప్రాతినిధ్యంపై పడే ప్రభావంపై ఆందోళనల నేపథ్యంలోనే తమ వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఒక గ్రాఫిక్ ద్వారా వివరించింది. గతంలో తమిళనాడు లోక్‌సభ సీట్లు 39 నుంచి 31 లేదా 32కు తగ్గొచ్చన్న అంచనాలతోనే తాము వ్యతిరేకించామని పేర్కొంది. పార్లమెంట్‌లో రాష్ట్ర వాటా 5.71 శాతం నుంచి 5.89 శాతానికి పడిపోవచ్చని, 2027 జనాభా లెక్కల తర్వాత ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది.

59 సీట్లు.. 2051 వరకు రక్షణ

తాజా ప్రతిపాదన ప్రకారం ప్రస్తుత వాటా తగ్గకుండా తమిళనాడు లోక్‌సభ ప్రాతినిధ్యం 59 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందని డీఎంకే వివరించింది. రాష్ట్ర వాటాను 7.23 శాతం వరకు కాపాడుకోవచ్చని, ఈ ఏర్పాట్ల వల్ల 2051 వరకు తమిళనాడు సీట్లు తగ్గకుండా 25 ఏళ్ల పాటు ప్రాతినిధ్యానికి రక్షణ లభిస్తుందని పేర్కొంది. డీలిమిటేషన్ చర్చలు వేడెక్కుతున్న వేళ, తమిళనాడు ప్రయోజనాలు, ప్రాతినిధ్యాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని డీఎంకే స్పష్టం చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.