Ghaziabad Fire: ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్రీన్ అవెన్యూ సొసైటీలో ఎగిసిపడుతున్న మంటలు!
Ghaziabad Fire: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఇందిరాపురం గ్రీన్ అవెన్యూ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు.
Ghaziabad Fire: ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్రీన్ అవెన్యూ సొసైటీలో ఎగిసిపడుతున్న మంటలు!
Ghaziabad Fire: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందిరాపురం ప్రాంతంలోని గ్రీన్ అవెన్యూ సొసైటీలో ఉన్న ఒక ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో అపార్ట్మెంట్ నివాసితులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఒక ఫ్లాట్‌లో మొదలైన మంటలు క్రమంగా పక్కనే ఉన్న ఇతర భాగాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న నల్లటి పొగ, ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ నివాసితులు అప్రమత్తమై వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి నష్టం భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.




