Paralakhemundi: చేతబడి నెపంతో వ్యక్తి హత్య - ఒడిశాలోని గజపతి జిల్లాలో కలకలం!

Paralakhemundi: ఒడిశా గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో చేతబడి అనుమానంతో నాటు వైద్యుడు రామచంద్ర మాలిక్ హత్య. 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీవో వెల్లడి.

S.Anil, Gajapati Dst
Published on: 1 Oct 2026 10:04 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: చేతబడి నెపంతో వ్యక్తి హత్య - ఒడిశాలోని గజపతి జిల్లాలో కలకలం!

Paralakhemundi: చేత బడి చేస్తున్నాడన్న అనుమానంతో గజపతి జిల్లాలోని మోహన ఠాణా పరిధిలో ఓ వ్యక్తిని హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతుడు మేరమా గ్రామానికి చెందిన రామచంద్ర మాలిక్ (41)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబం ధించి పోలీసులు ఐదుగురిని విచారణ నిమిత్తం అదు పులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర మాలిక్ గ్రామానికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై గుడిసెలో నివసిస్తున్నాడు.

అక్కడ ఉంటూ ప్రజలకునాటు వైద్యం చేస్తుండేవాడు. కొద్ది రోజుల కిందట గ్రామానికి చెందిన ఓ మహిళ, రెండు నెలల పసికందు మరణించారు. ఈ మరణా లకు కారణమని కొందరు చేతబడే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామంలో ఓ సమావేశం నిర్వహించి అనంతరం దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు లతోపాటు సైంటిఫిక్ బృందం చేరుకొని పరిసరాలను పరిశీలించారు.

ఈ కేసు కు సంబంధించి 12 మందిని అరెస్టు చేసినట్లు ఆర్ ఉదయగిరి ఎస్డీపీవో రాకేష్ కుమార్ సాహు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst