Illegal Activities: బహిరంగంగానే వ్యభిచారం..మహిళలే దారుణంగా కొట్టారు..!

Illegal Activities: మహారాష్ట్రలోని థానేలో బహిరంగంగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పందించకపోవడంతో శివసేన మహిళా అఘాడీ కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగారు.

Gagan kumar
Published on: 14 Nov 2026 2:47 PM IST
Illegal Activities
X

Illegal Activities: బహిరంగంగానే వ్యభిచారం..మహిళలే దారుణంగా కొట్టారు..!

Shiv Sena Mahila Aghadi: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే.. సామాన్యులే కాదు, మహిళలు కూడా కాళికావతారం ఎత్తుతారని నిరూపించే ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

నిత్యం వేలాది మంది ప్రయాణికులు, కుటుంబాలతో అత్యంత రద్దీగా ఉండే థానే ప్రాంతంలో బహిరంగంగా సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలకు శివసేన మహిళా విభాగం నేతలు చెక్ పెట్టారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వయంగా రంగంలోకి దిగి అసాంఘిక శక్తులను నడిరోడ్డుపై తరిమికొట్టారు.

మహారాష్ట్రలోని ప్రముఖ వాణిజ్య, నివాస ప్రాంతమైన థానేలో కొద్దికాలంగా బహిరంగంగా వ్యభిచారం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే కుటుంబాలు, మహిళలు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక మహిళలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఏమాత్రం స్పందించకుండా చూసీచూడనట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింత దిగజారింది.

పోలీసుల ఉదాసీన వైఖరితో విసిగిపోయిన శివసేన మహిళా అఘాడీ కార్యకర్తలు తామే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా ఆ ప్రాంతానికి చేరుకున్న మహిళా నేతలు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపైనే వారిని పరిగెత్తిస్తూ దేహశుద్ధి చేసి, అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శివసేన మహిళా కార్యకర్తలు అసాంఘిక శక్తులను తరిమికొడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాకపోయినప్పటికీ, ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మహిళలు ఈ సాహసానికి పూనుకోవాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన థానే నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.