Chhattisgarh: భారీ వరదలు.. కొట్టుకొస్తున్న మద్యం సీసాల కోసం ఎగబడిన జనం!
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీవర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలో కొట్టుకొస్తున్న మద్యం సీసాలను పట్టుకునేందుకు స్థానికులు నానా యాతనలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Chhattisgarh: భారీ వరదలు.. కొట్టుకొస్తున్న మద్యం సీసాల కోసం ఎగబడిన జనం!
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వరద ఉద్ధృతికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల్లో అధికారులు అప్రమత్తమై దాదాపు 5,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 16 మందిని హెలికాప్టర్ల సాయంతో రక్షించారు.
రాష్ట్రంలోని ధంతరీ జిల్లాలో మహానది నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ వరద నీటి ప్రవాహానికి ఓ మద్యం దుకాణం పూర్తిగా నీటమునిగింది. దుకాణంలో ఉన్న మద్యం సీసాలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి.
నదిలో మద్యం సీసాలు కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు, కొందరు యువకులు వాటిని దక్కించుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసించారు. స్థానిక వంతెన మీదకు చేరుకుని.. వెదురుకర్రలకు చీరలు కట్టి, వలలు విసిరి మరీ కొట్టుకొస్తున్న మద్యం సీసాలను పట్టుకునేందుకు నానా యాతనలు పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.




